తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 22వేలకు చేరువలో కరోనా కేసులు - దేశంలో కరోనా మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 21,700కు చేరింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి మొత్తం 4,325 మంది కోలుకోగా 686 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Corona cases close to 22,000 in india
దేశంలో 22 వేలకు చేరువలో కరోనా కేసులు

By

Published : Apr 23, 2020, 6:17 PM IST

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 21,700 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 39 మృతి చెందగా మొత్తం 686 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,325 మంది మహమ్మారి బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి‌ అయ్యారు. ప్రస్తుతం 16వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి.

దేశంలో కరోనా వివరాలు

మరోవైపు గత 14 రోజులుగా దేశవ్యాప్తంగా 78 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదుకాలేదని అధికారులు వెల్లడించారు. కేంద్రం అనుసరించిన వ్యూహాలతో దేశంలో కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకోగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే వైరస్​ కట్టడిలో చాలా వరకు విజయం సాధించామని కొవిడ్​ అత్యున్నత కమిటీ సభ్యుడు సీకే మిశ్రా స్పష్టం చేశారు.

"దేశంలో కేసుల పెరుగుదల భారీగా లేదు. గడిచిన 30 రోజుల లాక్​డౌన్ కాలంలో వైరస్​ను సమర్థంగా కట్టడి చేశాం. పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్నిచ్చాయి. సవాలుతో పాటే వ్యూహాం కూడా మారుతుంది. భారత్​ ఇప్పటివరకు చేసింది అదే. మార్చి 23 నాటికి దేశంలో 400 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 5 లక్షల పరీక్షలు చేస్తే 20 వేల కేసులు పాజిటివ్​ వచ్చాయి. 14 రోజులుగా 78 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా బాధితుల్లో 20 శాతం మంది కోలుకున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే చాలా బాగా కట్టడి చేశామని అర్థమవుతుంది."

-సీకే మిశ్రా

ఒక్క రోజులో 1,409 కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 1,409 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్​ వెల్లడించారు. మొత్తం 4,325 మంది పూర్తిగా కోలుకున్నట్లు అగర్వాల్ స్పష్టం చేశారు. రోజుకు సగటున 388 మంది కోలుకున్నట్లు చెప్పారు. దేశంలో రికవరీ రేటు 19.89 శాతంగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details