తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 47మంది మృతి - Case of coronavirus in india

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 26,917 మంది వైరస్ బారిన పడ్డారు. 826 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు అక్కడ 7,628 వైరస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్​, దిల్లీ, మధ్యప్రదేశ్​ల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

corona cases in india
భారత్​లో కరోనా విజృంభణ

By

Published : Apr 26, 2020, 6:00 PM IST

Updated : Apr 26, 2020, 6:54 PM IST

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 1,975మందికి వైరస్ సోకింది. గత 24 గంటల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ ఇప్పటివరకు 7,628 వైరస్ కేసులు నమోదయ్యాయి. 323మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత్​లో కరోనా గణాంకాలు

ఉత్తర్​ప్రదేశ్​లో వైద్యుడికి కరోనా..

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్ జవహర్​లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇప్పటివరకు ఆ కళాశాలలో ముగ్గురు వైద్యులకు వైరస్ సోకింది. రాష్ట్రంలో కొత్తగా 50మంది మహమ్మారి బారినపడ్డారు. రోజు వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 29కి పెరిగింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 1843కు చేరింది. 289మందికి వైరస్ నయమైంది.

బంగాల్​లో వైరస్​తో వైద్యుడి మృతి..

బంగాల్​లో వైరస్​తో పోరాడుతూ ఓ ప్రభుత్వ వైద్యుడు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య సేవల్లో అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేసే డాక్టర్ విప్లవ్ దాస్ గుప్తా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ అసువులు బాశారు. ఆయనను పలు ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 611మందికి వైరస్ సోకింది. 18మంది ప్రాణాలు కోల్పోయారు.

అండమాన్​లో..

కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్​ నికోబార్​ ద్వీపంలో మరో నలుగురికి కరోనా సోకింది. అక్కడ కేసుల సంఖ్య 33కు పెరిగింది.

అసోంలో 8మందికి నయం..

అసోంలో ఎనిమిది మందికి వైరస్ నయమైంది. రాష్ట్రంలో 35 మంది మహమ్మారి బారినపడగా ఇప్పటివరకు 27మందికి వైరస్ నయమైంది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​లో 69 కొత్త కేసులు..

రాజస్థాన్​లో ఇవాళ మరో 69 మందికి కొత్తగా వైరస్ సోకింది. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 2152కి పెరిగింది. మొత్తం 35 మంది కన్నుమూశారు. జైపుర్​లోనే 19మంది మృతి చెందారు.

ఉత్తరాఖండ్​లో..

ఉత్తరాఖండ్​లో మరో ఇద్దరు కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 50కి చేరింది. 26 మందికి వైరస్ నయమైంది.

15మంది సీఆర్​పీఎఫ్ సిబ్బందికి వైరస్..

సీఆర్​పీఎఫ్ దిల్లీ విభాగానికి చెందిన 15మంది జవాన్లకు మహమ్మారి సోకింది. ఇప్పటివరకు ఆ విభాగంలో 24మంది కరోనా బారినపడ్డారు. వారిని నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆగ్రా నుంచి ఛత్తీస్​గఢ్​కు వెళ్లిన 14మంది బీఎస్​ఎఫ్ జవాన్లకు కరోనా ఉందని అనుమానాలు తలెత్తిన కారణంగా వారిని నిర్బంధంలో ఉంచారు.

కేరళలో 11మందికి వైరస్..

కేరళలో మరో 11మందికి వైరస్ సోకింది. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 123కు పెరిగింది. మరో నలుగురికి వ్యాధి నయమైంది.

తమిళనాడులో..

తమిళనాడులో మరో ఇద్దరు వైరస్ బాధితులుగా మారారు. మొత్తంగా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 1755కు చేరింది. ఇప్పటివరకు 22మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:సరిహద్దు వద్ద 300 మంది ఉగ్రవాదులు- ఏ క్షణమైనా!

Last Updated : Apr 26, 2020, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details