తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్మశానం పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు అరెస్టు - Ghaziabad crematorium 24 dead

యూపీలో శ్మశానం పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మున్సిపల్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు ఇద్దరు సభ్యుల కమిటీని నియమించారు. మరోవైపు, నష్టపరిహారం పెంచాలని భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు మృతుల కుటుంబసభ్యులు.

Cops arrest 3 officials over Ghaziabad crematorium incident; victims' kin block key highway
స్మశానం పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు అరెస్టు

By

Published : Jan 4, 2021, 1:44 PM IST

ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​లోశ్మశానం పైకప్పు కూలి 24 మంది మరణించిన ఘటనలో ముగ్గురు మున్సిపల్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మురాద్​నగర్ నగర పాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి నిహారిక సింగ్, జూనియర్ ఇంజినీర్ చంద్రపాల్, సూపర్​వైజర్ ఆశిశ్​ను అదుపులోకి తీసుకున్నట్లు గాజియాబాద్ రూరల్ ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు. కాంట్రాక్టర్ అజయ్ త్యాగి కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని నియమించినట్లు స్పష్టం చేశారు.

బాధితుల నిరసన

ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దిల్లీ-మేరఠ్ రహదారిని దిగ్బంధించారు. నష్టపరిహారం పెంచాలని, మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు రహదారిపై చిక్కుకుపోయాయి.

మృతుల కుటుంబసభ్యుల నిరసన

ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు.

నిరసన ప్రాంతంలో పోలీసులు

ABOUT THE AUTHOR

...view details