ఉరిశిక్ష అమలు వాయిదా కోసం నిర్భయ దోషుల ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. దోషుల్లో ఒకడైనా పవన్ గుప్తా.. సుప్రీం కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్ అని వేసిన పిటిషన్ను కొట్టి వేయటాన్ని మరోసారి సమీక్షించాలని పిటిషన్ పేర్కొన్నాడు.
జనవరి 20న నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అంటూ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఉరి శిక్ష స్టే కోసం అవకాశం ఉన్నంత మేరకు వాయిదా వేయించాలని ప్రయాత్నాలు చేశారు దోషులు. పాటియాల కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని రకాల పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లతో సంబంధం లేకుండా.. డిసెంబర్ 20న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తీహార్ జైలు అధికారులు.