ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను జనవరి 15న ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే 14 మంది సభ్యుల హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంట్ భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.
మకర సంక్రాంతి ముగిసిన అనంతరం పార్లమెంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తే బాగుంటుందని భావించిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను జనవరి 15న పనులు ప్రారంభించమని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా టాటా సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.