భారత సరిహద్దుల్లో మూడు హెలిప్యాడ్లను నేపాల్ ప్రభుత్వం నిర్మిస్తోంది. గండక్ నది నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
వీటిలో రెండు హెలిప్యాడ్లను వరుసగా బిహార్ రాష్ట్రం వాల్మీకి నగర్‌లోని నరసాహి, త్రివేణిల్లో నిర్మిస్తున్నారు. మరో హెలిప్యాడ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లా సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిన్ వద్ద నిర్మిస్తున్నారు.