శాసనసభ అంగీకారంపై ...
శాసనసభ అంగీకారం ఉండాలన్న అంశంపై వివరణనిచ్చారు కశ్యప్. కశ్మీర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్నందున కేంద్రమే... సర్కారుగా వ్యవహరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వుకు మార్గం సుగమమైందన్నారు. జమ్ముకశ్మీర్‌కు 1954లో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించారని, అనంతర కాలంలో శాసనసభ అభిప్రాయం లేకుండానే పలు సవరణలు చేశారని గుర్తు చేశారు కశ్యప్. ఆర్టికల్ 370 ఇందుకు అనుమతిస్తుందని స్పష్టం చేశారు.
ఆర్టికల్ 370 రద్దుపై...
ఆర్టికల్ 370 సవరణ, రద్దు తాత్కాలిక ప్రొవిజన్ ద్వారా చేపట్టాలని క్లాజు 3 ద్వారా రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారన్నారు కశ్యప్. ప్రత్యేక ప్రొవిజన్‌గా చేపట్టాలనుకోలేదని విశదీకరించారు.
తర్వాతి అడుగు