అయోధ్యలో భూమిపూజ రోజున రామాలయ పరిసర ప్రాంతాల్లో భారీగా ఉగ్రదాడులు జరిపేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్య, దిల్లీ, జమ్ముకశ్మీర్‌లలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాయి.
అయోధ్యలో ఉగ్రదాడులకు భారీ కుట్ర! - terrorists
అయోధ్యలో రామ మందిరానికి ఆగస్టు 5న భూమిపూజ చేయనున్నారు. అదే రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా ఉగ్రదాడులకు పాక్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి.
అయోధ్యలో ఉగ్రదాడులకు భారీ కుట్ర!
అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణం 370 ఉపసంహరణ (ఏడాది క్రితం) రోజు ఆగస్టు 5వ తేదీ కావటం వల్ల భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఇదీ చూడండి:'అయోధ్యలో టైమ్ క్యాప్సుల్ వార్తలు అవాస్తవం'