తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా ప్రతిష్టంభన: నేడు కాంగ్రెస్​-ఎన్​సీపీ కీలక భేటీ - మహారాష్ట్ర రాజకీయాలు

మహా ప్రతిష్టంభనపై నేడు కాంగ్రెస్​-ఎన్​సీపీ మధ్య కీలక భేటీ జరగనుంది. ఇందులో ఇరు పార్టీల అగ్రనేతలు పాల్గొననున్నారు. శివసేనకు మద్దతిచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మహా ప్రతిష్టంభన: నేడు కాంగ్రెస్​-ఎన్​సీపీ కీలక భేటీ

By

Published : Nov 20, 2019, 5:06 AM IST

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. శివసేనకు మద్దతినిచ్చే అంశంపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్-ఎన్​సీపీ నేతలు భేటీకానున్నారు.

నిజానికి ఈ సమావేశం మంగళవారమే జరగాల్సి ఉంది. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు తీరికలేకుండా ఉండటమే భేటీ వాయిదా పడటానికి కారణం. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని బుధవారానికి మార్చడానికి ఎన్​సీపీ అంగీకరించింది.

అగ్రనేతల చర్చలు..

అక్టోబర్​లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​తో కలిసి బరిలో దిగింది ఎన్​సీపీ. ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితులు మారడం వల్ల శివసేనకు మద్దతిచ్చే విషయాన్ని ఎన్​సీపీతో చర్చించేందుకు కాంగ్రెస్.. అహ్మద్​ పటేల్​, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్​ సహా రాష్ట్రనేతలు తో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్​సీపీ తరఫున జయంత్ పాటిల్, ప్రఫుల్​ పటేల్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొంటారు.

వీడని ప్రతిష్టంభన

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబర్ మొదటి వారం వరకు స్వీయ గడువు విధించుకుంది శివసేన. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు శివసేన నేత సంజయ్ రౌత్. ప్రస్తుతమున్న అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే మరింత సమయం పడుతుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details