కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 30న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 'భారత్ బచావో' ర్యాలీని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మోదీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 5 నుంచి రాష్ట్ర , జిల్లా స్థాయిల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు ముగింపుగా ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన దిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరయ్యారు.