ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోమారు తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా.. నేడు "స్పీక్ ఆప్ ఫర్ డెమొక్రసీ" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. రాజకీయ వ్యవస్థలను దుర్వినియోగించి.. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు పేర్కొంది.
"ప్రజలు ఎన్నుకన్న ప్రభుత్వాలను కూల్చడానికి చేస్తున్న ప్రయత్నాలు, రాజ్యంగా సంస్థలను దుర్వినియోగిస్తున్న తీరుతో భాజపాకు వ్యతిరేకంగా 26న దేశవ్యాప్తంగా "స్పీక్ అప్ ఫర్ డెమొక్రసీ" ఆన్లాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి గళం విప్పండి."
--- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత.
అనంతరం ఇదే విషయంపై సోమవారం దేశవ్యాప్తంగా పీసీసీలు రాజ్భవన్ల వద్ద నిరసనలు చేపడతాయని వేణుగోపాల్ వెల్లడించారు.