తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపిస్టుకు కాంగ్రెస్ టికెట్- ప్రశ్నించారని మహిళపై దాడి - Congress' Tara Yadav manhandled by party workers at an event in Deoria.

అత్యాచార నిందితుడికి కాంగ్రెస్.. టికెట్ ఇవ్వడంపై అదే పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తన అభిప్రాయం చెప్పినందుకు తోటి కార్యకర్తలు ఆమెపై దాడి చేశారు.

Congress' Tara Yadav manhandled by party workers at an event in Deoria.
రేపిస్టుకు కాంగ్రెస్ టికెట్- ప్రశ్నించినందుకు మహిళపై దాడి

By

Published : Oct 11, 2020, 12:23 PM IST

రేపిస్టుకు కాంగ్రెస్ టికెట్- ప్రశ్నించారని మహిళపై దాడి

ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రసాభాస జరిగింది. దేవరియా నియోజకవర్గ ఉపఎన్నికకు ముకుంద్ భాస్కర్ మణికి టికెట్ ఇవ్వడంపై తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు.

ఈ క్రమంలో సభలో తోపులాట జరిగింది. మహిళపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ నాయక్ సైతం పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

"ఓ తప్పుడు వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చింది. ఇది సమాజంలో పార్టీ ప్రతిష్ఠను పాడు చేస్తుంది. నా అభిప్రాయాన్ని సచిన్ నాయక్​తో పంచుకున్నాను. అత్యాచార నిందితుడికి కాకుండా వేరొకరికి టికెట్ ఇవ్వమని చెప్పాను. ఈ మాట చెప్పిన వెంటనే కార్యకర్తలు నాపై దాడి చేశారు. దీనిపై ప్రియాంకా గాంధీ తీసుకొనే చర్యల కోసం ఎదురుచూస్తున్నాను."

-తారా యాదవ్, కాంగ్రెస్ కార్యకర్త

యూపీలోని 7 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details