తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ హింసపై కాంగ్రెస్ శాంతియుత నిరసన - congress peace march in delhi

దిల్లీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శాంతియుత ర్యాలీ నిర్వహించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీని పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. అనంతరం నేతలందరూ రోడ్డుపై బైఠాయించారు.

Congress takes out peace march against Delhi violence
కాంగ్రెస్ ర్యాలీ

By

Published : Feb 26, 2020, 5:49 PM IST

Updated : Mar 2, 2020, 3:56 PM IST

దిల్లీలో కాంగ్రెస్ శాంతియుత ర్యాలీ నిర్వహించింది. గత కొద్ది రోజులుగా దిల్లీలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసాత్మక నిరసనలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ ర్యాలీ చేసింది.

అక్బర్​ రోడ్​ నుంచి రాజ్​ఘాట్​ వరకు తలపెట్టిన ఈ ర్యాలీని పోలీసులు జన్​పథ్​ రోడ్​ వద్ద అడ్డుకున్నారు. దీంతో నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. మహాత్మా గాంధీని స్మరిస్తూ పాటలు పాడారు. ఐకమత్య నినాదాలు చేశారు.

ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రణ్​దీప్ సుర్జేవాలా పాల్గొన్నారు.

దిల్లీ హింసపై కాంగ్రెస్ శాంతియుత నిరసన
Last Updated : Mar 2, 2020, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details