తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్టికల్​ 370పై కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం: మోదీ

దేశ హితంకోసం జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తే.. కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. హిందుస్థాన్, హరియాణా రైతులకు హక్కున్న జలాలు 70 ఏళ్లుగా పాకిస్థాన్​కు వెళుతున్నాయన్నారు. దీనిని ఆపి, ఆ నీటిని ప్రజల ఇంటి వద్దకు వచ్చేలా చేస్తానని హరియాణా కర్​ఖీ దాద్రీలో ఎన్నికల ప్రచార సభలో చెప్పారు.

By

Published : Oct 15, 2019, 4:27 PM IST

Updated : Oct 16, 2019, 6:10 AM IST

ఆర్టికల్​ 370పై కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం: మోదీ

ఆర్టికల్​ 370పై కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం: మోదీ

హరియాణాలోని ప్రతిగ్రామంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హరియాణాలోని కర్​ఖీ దాద్రీలో ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు మోదీ. కాంగ్రెస్​పై ధ్వజమెత్తారు. అవినీతి పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించారని తీవ్ర విమర్శలు చేశారు.

"దేశాన్ని దోచుకునే వారిని జైలు గడప వరకు తీసుకొచ్చానని లోక్​సభ ఎన్నికల సమయంలో చెప్పాను. వచ్చే ఐదేళ్లలో వారంతా జైలుకు వెళతారు. హిందుస్థాన్, హరియాణా రైతులకు హక్కు ఉన్న నీరు 70ఏళ్లుగా పాకిస్థాన్​కు వెళుతోంది. దీనిని ఆపి ఆ నీటిని ప్రజల ఇళ్ల వరకు వచ్చేలా చేస్తా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జమ్ముకశ్మీర్​కు ఆర్టికల్​ 370నుంచి విముక్తి కల్పించాం. జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లకు దేశమంతా అండగా నిలిచింది. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం దేశంలో, అంతర్జాతీయంగా ఈ నిర్ణయంపై దుష్ప్రచారం చేస్తున్నారు. "
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

చైనా అధ్యక్షుడి నోట దంగల్ మాట

ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో చెన్నైలో భేటీ అయినప్పుడు.. ఆయన దంగల్​ చిత్రాన్ని చూసినట్టు తనతో చెప్పారని మోదీ తెలిపారు. హరియాణాకు చెందిన యువతులు క్రీడా రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు.

దాద్రీ అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా రెజ్లర్ బబితా ఫోగాట్ బరిలోకి దిగారు. దంగల్​ చిత్రం బబిత, ఆమె సోదరి గీత జీవితకథ ఆధారంగా వచ్చింది.

ఇదీ చూడండి: మోదీ బొమ్మతో కర్ణాటక యువకుడి ప్రపంచ రికార్డ్​

Last Updated : Oct 16, 2019, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details