ఎక్సైజ్ సుంకం పరిమితి పెంపుపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతర్జాతీయంగా పడిపోతున్న చమురు ధరల ప్రయోజనాలను వాహనదారులకు అందకుండా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. జీవనోపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం అమానవీయంగా వ్యవహరిస్తోందని ట్వీట్ చేశారు.
"ప్రియమైన ప్రధాని, ఈ పద్ధతిలో ప్రజల కష్టాలను సద్వినియోగం చేసుకోవడం సిగ్గుచేటు, అమానవీయం. ప్రజలు జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోతున్నారు. చమురు ధరలు పతనమవుతుంటే ఎక్సైజ్ సుంకం పెంచి భాజపా ప్రభుత్వం ప్రయోజనం పొందాలని చూస్తోంది. ప్రజలను అంచుకు నెట్టవద్దు"