పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. లోక్సభ వేదికగా సరిహద్దు ఉద్రిక్తతలపై రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేసిన అనంతరం.. తమకు ప్రశ్నించే అవకాశాన్ని కల్పించలేదని ఆరోపించింది. విపక్షాల గొంతును అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని విరుచుకుపడింది.
ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. అతి ముఖ్యమైన విషయంపై రక్షణమంత్రి ప్రకటన చేస్తున్న సమయంలో సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు లేరని ప్రశ్నించారు.
"చైనా ఆక్రమణలపై ప్రధాని మోదీ దేశప్రజలకు అబద్ధం చెప్పారు. రక్షణమంత్రి ప్రకటన ద్వారా ఇది స్పష్టంగా అర్థమవుతోంది. మన దేశ ప్రజలు జవాన్లకు ఎప్పుడూ మద్దతుగానే ఉంటారు. మరి ప్రధాని మోదీ.. మీరు చైనాకు వ్యతిరేకంగా ఎప్పుడు చర్యలు చేపడతారు? చైనా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకుంటారు?"