తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ సత్యాగ్రహం

పౌర చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా దిల్లీ రాజ్​ఘాట్​లో సోమవారం కాంగ్రెస్​ సత్యాగ్రహ ధర్నా చేపట్టనుంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు సోనియా నేతృత్వంలో మౌనదీక్ష కొనసాగనుంది.

Congress Satyagraha Dharna in Delhi Rajghat today
నేడు దిల్లీ రాజ్​ఘాట్​లో కాంగ్రెస్​ సత్యాగ్రహ ధర్నా!

By

Published : Dec 22, 2019, 9:11 AM IST

Updated : Dec 22, 2019, 11:05 AM IST

పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది​. దిల్లీలోని రాజ్​ఘాట్​లోకాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ సోమవారంసత్యాగ్రహ ధర్నా చేపట్టనున్నారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మౌన దీక్ష చేపట్టనున్నారు కాంగ్రెస్​ నేతలు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడాలని డిమాండ్​ చేస్తూ.. కాంగ్రెస్​ సత్యాగ్రహ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో రాహుల్​, ప్రియాంక గాంధీ సహా పలువుపు ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: నిరసనల నడుమ నేడు ప్రధాని మోదీ బహిరంగ సభ

Last Updated : Dec 22, 2019, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details