మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. జాతీయ భద్రత, ఆర్థిక, విదేశీ విధానాలకు సంబంధించి ఆమె సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
దిల్లీలో ఇందిరా స్మారకం శక్తిస్థల్‌లో జరిగిన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఇందిరా గాంధీకి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీలు, కార్యకర్తలు శక్తి స్థల్‌కు భారీగా చేరుకున్నారు.