జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అన్ని రకాలుగా భిన్నమైన ప్రజలు నివసిస్తున్న జమ్ముకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విడగొట్టిన ఈ రోజు భారత చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించింది.
కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర ఐక్యత, సమగ్రతలతో కేంద్రం ఆడుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.
"స్వతంత్ర భారతంలో పార్లమెంట్ ఒక ఊహించని అడుగు వేసింది. జమ్ముకశ్మీర్ భారత్‌తో కలవడం వెనక ఒక చరిత్ర ఉంది. భారత్‌తో కలిసి ఉండే క్రమంలో ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, సైన్యం, పోలీసులు తమ ప్రాణాలను అర్పించారు. వీరి త్యాగాలతో జమ్ముకశ్మీర్ భారత్‌తో కలసి ఉంది. ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగితే వాటిని పౌర సమాజం, రాజకీయ పార్టీలు, సైన్యం సమర్థంగా ఎదుర్కొన్నాయి.