తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తులకే కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు' - Gandhi family

కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తులే కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని.. ఓ పుస్తకం కోసం ఏడాది క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్​కు పూర్తిస్థాయి అధ్యక్షుడి నియామకం జరగని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంకా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Congress presidency
ప్రియాంకా గాంధీ

By

Published : Aug 20, 2020, 7:03 AM IST

కాంగ్రెస్‌ నాయకత్వం గురించి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. గాంధీ కుటుంబానికి చెందని వారే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని ఏడాది క్రితం ఓ పుస్తకం కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. నాయకత్వ విషయంలో రాహుల్‌ గాంధీ వైఖరితో తానూ ఏకీభవిస్తున్నానని, పార్టీ తన సొంత పంథాను అన్వేషించుకోవాల్సిందేనని ప్రియాంక స్పష్టం చేశారు. రాజకీయాల్లో వారసత్వ భావనకు తాను వ్యతిరేకమని ప్రియాంక ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా వారి ఆదేశాలను పాటిస్తానని చెప్పారు.

హరీశ్‌షా, ప్రదీప్‌ చిబ్బర్‌ రచయితలుగా ఉన్న 'ఇండియా టుమారో: కన్వర్జేషన్స్‌ విద్‌ నెక్స్ట్‌ జనరేషన్‌ పొలిటికల్‌ లీడర్స్‌' పుస్తకం ఇటీవలే విడుదలైంది. కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా కొనసాగుతూ, పూర్తిస్థాయి అధ్యక్షుడి నియామకం ఇంకా జరగని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంకా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భాజపా ప్రయోజనాల కోసమే..

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు బుధవారం మీడియా సమావేశాల్లో, ట్వీట్ల ద్వారా స్పందించారు. పార్టీ శ్రేణులు రాహుల్‌ గాంధీ నాయకత్వాన్నే కోరుకుంటున్నాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్‌ గోహిల్‌ తెలిపారు. గత ఏడాది ప్రియాంక ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలను ఇప్పుడు ప్రచారంలోకి తీసుకురావటం భాజపా ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఆరోపించారు.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే...

ABOUT THE AUTHOR

...view details