తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' స్పీకర్​గా పటోలే- ఎన్నికకు ముందే భాజపా డ్రాప్ - భాజపా

మహారాష్ట్ర స్పీకర్​గా మహా వికాస్​ అఘాడీ నేత నానా పటోలే బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్​.. పటోలేను సభాపతి స్థానంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు.  స్పీకర్​ రేసు నుంచి భాజపా వెనక్కి తగ్గిన కారణంగా పటోలే ఎన్నిక ఏకగ్రీవం అయింది.

Maharashtra Assembly Speaker post
'మహా' స్పీకర్​గా పటోలే ఏకగ్రీవం

By

Published : Dec 1, 2019, 10:45 AM IST

Updated : Dec 1, 2019, 12:13 PM IST

మహారాష్ట్ర స్పీకర్​గా అధికార కూటమి నేత, కాంగ్రెస్​ ఎమ్మెల్యే నానా పటోలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీగా ఎవరూ లేనందున పటోలే ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్​ దిలీప్​ వాల్సే పాటిల్​ ప్రకటించారు. నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్​ పటోలేకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభాపతి స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

రైతు నాయకుడిగా..

ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి స్పీకర్​ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. ఒక శాసనసభ్యుడిగా, రైతుల నాయకుడిగా పటోలే పని చేయాలని కోరారు ఫడణవీస్​.

సంప్రదాయాన్ని గౌరవించి..

మహారాష్ట్రలో స్పీకర్​ ఎన్నిక జరిగే కొద్ది గంటల ముందు ప్రతిపక్ష భాజపా అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్పీకర్​ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. స్పీకర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం సంప్రదాయంగా వస్తున్న క్రమంలో పోటీ నుంచి తప్పుకోవాలని అఖిల పక్ష పార్టీలో నేతలు సూచించినట్లు మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్​ తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: యువ వైద్యురాలి ఆత్మ శాంతి కోసం గంగా హారతి

Last Updated : Dec 1, 2019, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details