కొత్త వ్యవసాయ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళ కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. రైతుల(సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020 రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ చట్టం చెల్లదని, వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
రైతుల ట్రైబ్యూనల్ ఏర్పాటు చేసే ఆదేశాలు ఇవ్వాలని ప్రతాపన్ అభ్యర్థించారు. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సమాంతర మార్కెట్లకు అవకాశం ఇస్తే రైతులు దోపిడీకి గురవుతారని పేర్కొన్నారు.