తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఉన్నా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తనకు ఇచ్చిన హోమ్​ క్వారంటైన్​ గడువు ముగియకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చారు. అయితే వచ్చేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకొని పీపీఈ కిట్ ధరించారు.

corona mla ppe kit latest news
కరోనా ఉన్నా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. కానీ!

By

Published : Jun 19, 2020, 2:23 PM IST

ఓటు.. ఓ వ్యక్తిని గద్దె ఎక్కించాలన్నా, దించాలన్నా ఉపయోగపడే ఆయుధం. అందుకే భారత్​లో ఎక్కడైనా ఓటింగ్​కు ప్రాముఖ్యం ఎక్కువే. తాజాగా మధ్యప్రదేశ్​లో 3 రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓటు వేసేందుకు కరోనా ఉన్నా ఏకంగా అసెంబ్లీకి వచ్చారు ఓ ఎమ్మెల్యే.

పీపీఈ కిట్లు ధరించి
పీపీపీ కిట్ ధరించిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే

రాష్ట్రంలోని ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు ఇటీవలె కరోనా పాజిటివ్​ వచ్చింది. హోమ్​ క్వారంటైన్​లో ఉన్న ఆయన.. రాజ్యసభకు అభ్యర్థులను ఎన్నుకునేందుకు భోపాల్​ అసెంబ్లీ వచ్చారు. పీపీఈ కిట్​ ధరించి వచ్చి, ఓటు వేసిన తక్షణమే వెళ్లిపోయారు. వెంటనే అక్కడి సిబ్బంది మొత్తం అసెంబ్లీని శానిటైజ్​ చేశారు.

శానిటైజ్​ చేస్తున్న సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details