తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పు నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ - k c venugopal latest news

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న క్రమంలో కాంగ్రెస్​ ఉన్నత స్థాయి నాయకత్వం సీడబ్ల్యూసీ నేడు సమావేశం కానుంది. తీర్పు నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం.

అయోధ్య తీర్పు నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ

By

Published : Nov 9, 2019, 5:16 AM IST

Updated : Nov 9, 2019, 7:42 AM IST

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై నేడు ఉదయం 10:30 గంటల సమయంలో తుది తీర్పు వెలువరించనుంది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ఉన్నత స్థాయి నాయకత్వం సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. తీర్పు సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

కాంగ్రెస్​ సీడబ్ల్యూసీ సమావేశం ఆదివారం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో శనివారం ఉదయమే భేటీ కానున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ తెలిపారు. సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశానికి హజరవుతారని తెలిపారు.

కేసీ వేణుగోపాల్​ ట్వీట్​

కాంగ్రెస్​ ఉన్నత స్థాయి నిర్ణయాత్మక బృందం సీడబ్ల్యూసీ.. కీలక విషయాలపై పార్టీ వైఖరిని నిర్ణయించనుంది.

ఇదీ చూడండి: భాజపా-శివసేన మధ్య 'మహా' తూటాలు

Last Updated : Nov 9, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details