తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైల్లో చిదంబరాన్ని కలిసిన కాంగ్రెస్​ నేతలు - గులాం నబీ అజాద్

ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో అరెస్టయి తిహార్​ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేతలు కలిశారు. వివిధ అంశాలపై దాదాపు అరగంట పాటు చర్చించినట్లు సమాచారం.

జైల్లో చిదంబరాన్ని కలిసిన కాంగ్రెస్​ నేతలు

By

Published : Sep 18, 2019, 4:05 PM IST

Updated : Oct 1, 2019, 1:58 AM IST

తిహార్​ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్​ అగ్రనేతలైన గులాం నబీ అజాద్​, అహ్మద్​ పటేల్​ బుధవారం కలిశారు. వారి వెంట చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కశ్మీర్​ అంశం, ఆర్థిక మాంద్యం తదితర విషయాలపై దాదాపు అరగంట పాటు వీరు చర్చించుకున్నట్లు సమాచారం.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో గత నెల 21న సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా...జ్యుడీషియల్​ కస్టడీకి అప్పగించింది. దీంతో సెప్టెంబరు 5 నుంచి ఆయన తిహార్​ జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో బెయిల్​ కోసం చిదంబరం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 23న విచారణ జరగనుంది. మరోవైపు ఆయన జ్యుడీషియల్​ కస్టడీ రేపటితో ముగియనుంది.

ఇదీ చూడండి : మందగమనంపై ప్రియాంక 'హౌదీ-మోదీ' పంచ్

Last Updated : Oct 1, 2019, 1:58 AM IST

ABOUT THE AUTHOR

...view details