తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిలో కర్ణాటకీయం - డీకేకు పోలీసుల బ్రేక్​

కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్​ అభ్యంతరాలు వ్యక్తం చేయటం వల్ల అధికార పార్టీకి స్వల్ప ఊరట లభించింది. ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు అధికార పక్షానికి మరింత సమయం దొరికింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ మంత్రి, ట్రబుల్​షూటర్​ డీకే శివకుమార్​ ముంబయి చేరుకున్నారు.

ముంబయిలో కర్నాటకీయం

By

Published : Jul 10, 2019, 9:52 AM IST

Updated : Jul 10, 2019, 9:58 AM IST

కర్ణాటక రాజకీయాలు ముంబయి బాట పట్టాయి. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్​ అభ్యంతరంతో అధికార పార్టీకి కలిసివచ్చింది. ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సమయం దొరికింది. ఫలితంగా కాంగ్రెస్ ట్రబుల్​షూటర్, మంత్రి​ డీకే శివకుమార్​ ఉదయాన్నే ముంబయి చేరుకున్నారు.

సీఎం, శివకుమార్​ ముంబయి వస్తున్నారని.. తమకు ప్రమాదం పొంచి ఉందని ముంబయి పోలీసులకు ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్​కు భారీ బందోబస్తు కల్పించింది అక్కడి ప్రభుత్వం. హోటల్​ వద్దకు చేరుకున్న శివకుమార్​ను ముంబయి పోలీసులు అడ్డుకోగా... హైడ్రామా నెలకొంది.

హోటల్​ బయట కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే నారాయణ గౌడకు మద్దతుగా... ఆందోళన చేపట్టారు. "గో బ్యాక్​ శివకుమార్​" అంటూ నినాదాలు చేశారు. ఇదే హోటల్​లో గదిని బుక్​ చేసుకున్న శివకుమార్​.. లోపలికి అనుమతించకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముంబయిలో కర్ణాటకీయం

​ "నేను ఈ హోటల్​లో బుక్​ చేసుకున్న గదికి వెళ్లడానికి.. భద్రతా కారణాల వల్ల పోలీసులు అనుమతి ఇవ్వటం లేదు. నేను ఎవరికీ హాని తలపెట్టేందుకు రాలేదు. మేం ఎలాంటి బలగంతో రాలేదు. ఆయుధాలను తీసుకురాలేదు. నా సహచరులతో ప్రేమగా మాట్లాడేందుకే వచ్చాను. రాత్రి భాజపా వాళ్లు వచ్చి ఆ లేఖ రాయించి ఉంటారు. ఈ విషయంలో ఆ పార్టీకి సంబంధం లేదన్నారు. మరి ఇక్కడ ఇంత మంది పోలీసులు ఎందుకు ఉన్నట్లు?"

-డీకే శివకుమార్​, కర్ణాటక మంత్రి

ఇదీ చూడండి: కర్'​నాటకం'పై దద్దరిల్లిన ఉభయసభలు

Last Updated : Jul 10, 2019, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details