పశ్చిమ్ బంగాలో విజయదశమి వేడుకలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఆ రాష్ట్రంలో దుర్గామాత పూజలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా కారణంగా ఆంక్షల నడుమే పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోల్కతాలోని దుర్గా పూజా కమిటీ వినూత్న ఆలోచనతో విగ్రహాన్ని రూపొందించింది. దుర్గామాత వైద్యురాలి అవతారమెత్తి కరోనా వైరస్ అంతమొందించే ఇతివృత్తంతో దీన్ని తయారు చేశారు.
డాక్టర్ అవతారంలో దుర్గామాత.. క్రియేటివిటీకి థరూర్ ఫిదా - Shashi Tharoor news
విజయదశమి వేడుకల్లో భాగంగా కోల్కతా దుర్గాపూజ కమిటీ ఏర్పాటు చేసిన ఓ విగ్రహాన్ని చూసి ముగ్ధులైపోయారు కాంగ్రెస్ నేత శశిథరూర్. రాక్షసుని అవతారంలో ఉన్న కరోనాను.. వైద్యురాలి రూపంలో ఉన్న దుర్గామాత సూదితో అంతంచేస్తున్న ఇతివృత్తంగా దీనిని రూపొందించారు. ఈ సృజనాత్మక ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు థరూర్.
ఈ విగ్రహాన్ని చూసి ముగ్ధులైపోయారు కాంగ్రెస్ నేత శశిథరూర్. సృజనాత్మకతతో రూపొంచిందిన దుర్గామాత విగ్రహం అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. దీన్ని తయారు చేసిన రూపకర్త, శిల్పికి సెల్యూట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
బంగాల్లో ఈనెల 22నుంచి విజయదశమి వేడుకలు ప్రారంభంకానున్నాయి. కరోనా నేపథ్యంలో దుర్గామాత మండపాల్లో ఈసారి సందర్శకులకు అనుమతి లేదని కోల్కతా హైకోర్టు సోమవారం తెలిపింది. పెద్ద మండపాల్లో 25మంది, చిన్న మండపాల్లో 15మంది నిర్వాహకులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.