ప్రియాంక గాంధీకి షాక్- బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం - Priyanka Gandhi latest news
![ప్రియాంక గాంధీకి షాక్- బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం Congress leader Priyanka Gandhi Vadra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7850892-189-7850892-1593611646982.jpg)
ప్రియాంక గాంధీకి షాక్
19:01 July 01
ప్రియాంక గాంధీకి షాక్- బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. దిల్లీలో ఆమె ఉంటున్న బంగ్లాను ఆగస్టు 1 నాటికి ఖాళీ చేయాలని ఆదేశించింది.
ఎస్పీజీ భద్రతను రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ బంగ్లాలో ఉండేందుకు ఆమెకు అర్హత లేదని, అందుకే ఆ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ స్పష్టంచేసింది. గడువులోగా ఖాళీ చేయకపోతే అద్దె చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
Last Updated : Jul 1, 2020, 7:25 PM IST