కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు చెందిన 21 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బెంగళూరులో రమదా హోటల్లో ఉన్నారు. వారిని కలిసేందుకు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నించారు. కానీ పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేత.. హోటల్ సమీపంలోనే ధర్నాకు కూర్చుకున్నారు. దీనితో దిగ్విజయ్ సింగ్ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన దిగ్విజయ్ అరెస్టు
మధ్యప్రదేశ్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్న బెంగళూరులోని రమదా హోటల్ ముందు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ధర్నా చేపట్టారు. దీనితో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన దిగ్విజయ్ అరెస్టు
"తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని భావిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా ఐదుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడాను. వారు బందీలుగా ఉన్నారని, వారి నుంచి ఫోన్లు లాక్కొన్ని బందీగా ఉంచారని తెలిపారు. 24 గంటలూ ఎమ్మెల్యేలు ఉన్న గదుల ముందు పోలీసులు పహారా కాస్తున్నారు. వారి ప్రతి కదలికను గమనిస్తున్నారు."
- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ నేత
Last Updated : Mar 18, 2020, 9:20 AM IST