తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ ముందుకు ఐశ్వర్య- పన్ను ఎగవేతపై ప్రశ్నల వర్షం

డీకే శివకుమార్​కు సంబంధించిన మనీలాండరింగ్​ కేసు విచారణలో భాగంగా ఆయన కుమార్తె ఐశ్వర్య ఈడీ ముందుకు హాజరయ్యారు. మనీ లాండరింగ్​ నిరోధక చట్టం కింద ఐశ్వర్య వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది ఈడీ.

ఈడీ ముందుకు డీకే శివకుమార్​ కుమార్తె ఐశ్వర్య

By

Published : Sep 12, 2019, 1:47 PM IST

Updated : Sep 30, 2019, 8:14 AM IST

కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​కు సంబంధించిన మనీలాండరింగ్​ కేసు విచారణలో భాగంగా.. ఆయన కుమార్తె ఐశ్వర్య గురువారం ఈడీ ముందుకు హాజరయ్యారు. పీఎంఎల్​ఏ (మనీ లాండరింగ్​ నిరోధక చట్టం) కింద 22ఏళ్ల ఐశ్వర్య వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది ఈడీ.

2017లో తన కుమార్తెతో కలిసి సింగపూర్​ పర్యటనకు వెళ్లినట్లుగా శివకుమార్​ చేసిన వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించనున్నారు. పర్యటనకు సంబంధించిన పత్రాలు, వివరాలను ఐశ్వర్య నుంచి సేకరించనున్నారు ఈడీ అధికారులు.

తండ్రి శివకుమార్​కు చెందిన ఓ విద్యాసంస్థ ట్రస్ట్​లో సభ్యురాలు ఐశ్వర్య. అనేక ఆస్తులు, ఇంజనీరింగ్​ సహా అనేక కళాశాలకు చెందిన కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలను ఈ ట్రస్ట్​ చూసుకుంటోంది.

పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల విషయంలో.. శివకుమార్‌ను సెప్టెంబర్​ 3న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు.

ఇదీ చూడండి:-మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ అరెస్ట్​

Last Updated : Sep 30, 2019, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details