దేశంలో అతిపెద్ద పార్టీకే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందని సిమ్లాలో ధీమా వ్యక్తం చేశారు. గతంలో అధిక స్థానాల్లో గెలుపొంది మిత్రపక్షాల మద్దతుతో యూపీఏ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
అతిపెద్ద పార్టీకే ప్రధాని పదవి: ఆజాద్ - PM CANDIDATE
ప్రధాని పదవిని కాంగ్రెస్ కోరుకోవడం లేదనే వార్తల్లో నిజం లేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. దేశంలో అతిపెద్ద పార్టీకే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలుంటాయని స్పష్టం చేశారు. తక్కువ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు ఎక్కువ కాలం కొనసాగలేరని అభిప్రాయపడ్డారు ఆజాద్.
" ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదనడం అవాస్తవం. మాది అతిపెద్ద ప్రాచీన పార్టీ. ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశం దేశంలో పెద్ద పార్టీకే ఉంటుంది. ప్రధాని అభ్యర్థి ఎవరు అని ఎన్నికలు పూర్తవకుండా ఇప్పుడే చర్చించడం సరికాదు. కాంగ్రెస్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ సరైన వ్యక్తి. గతంలో గుజరాల్, దేవెగౌడ, చంద్రశేఖర్ ఎక్కువ కాలం ప్రధాని పదవిలో కొనసాగలేకపోయారు. తక్కువ సంఖ్యలో ఎంపీలు ఉండటమే అందుకు కారణం. కాంగ్రెస్ 273 స్థానాల్లో గెలుపొందగలదు. గతంలో 400కుపైగా స్థానాల్లో విజయం సాధించిన సందర్భాలున్నాయి. "
-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి: నన్ను అరెస్టు చేస్తే అంతే...: కమల్ హాసన్