కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు అండగా నిలిచిందేందుకు కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. 'హ్యాష్ ట్యాగ్ స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్' పేరిట ప్రచారం ప్రారంభించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ఒక నిమిషం నిడివిగల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
"రైతుల హితం కోసమే వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చామని మోదీ చెబుతున్నారు. ఈ చట్టాలు రైతుల మంచికోసమే అయితే అన్నదాతలు ఎందుకు సంతోషంగా లేరు? ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? మోదీ.. ఇద్దరు, ముగ్గురు మిత్రులకు ఉపయోగపడేందుకే ఈ చట్టాలు తెచ్చారు. అందుకే దేశానికి శక్తినిచ్చే అన్నదాతకు మద్దతుగా మనందరం నిలబడాల్సిన అవసరముంది."
-- ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ