కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి ఏడాది దాటిపోయింది. పార్టీ ఎన్నడూ చూడనంత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో పార్టీని తిరిగి గాడిన పెట్టాలని.. లేకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా పని మరింత సులభమవుతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ ఝా అభిప్రాయపడ్డారు. 'ఈటీవీ భారత్'తో ముఖాముఖిలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.
కాంగ్రెస్లో కొరవడిన ప్రజాస్వామ్యం: సంజయ్ ఝా - సంజయ్ ఝా ముఖాముఖి
ప్రస్తుతం కాంగ్రెస్లో పరిస్థితులు, సంక్షోభంపై పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ ఝా 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాలన్నారు.
![కాంగ్రెస్లో కొరవడిన ప్రజాస్వామ్యం: సంజయ్ ఝా CONGRESS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7540184-thumbnail-3x2-congress.jpg)
పార్టీలో అధ్యక్షుడ్ని ఎన్నుకోవడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయని ఆయన ఒప్పుకున్నారు. రెండు లోక్సభ ఎన్నికల్లో వరుస పరాజయాలు, పలు రాష్ట్ర ఎన్నికల్లో ఓటమి పాలవడం తమ వ్యూహంలో తప్పిదాలను చెబుతున్నాయన్నారు. వీలైనంత త్వరగా సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు.
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందన్నారు. కొన్ని రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని... లేకపోతే పార్టీ మరింత సంక్షోభంలోకి జారిపోయే అవకాశం ఉందని సంజయ్ విశ్లేషించారు. పార్టీ అధిష్ఠానం ఈ విషయంపై మరింత లోతుగా చర్చించాలని సూచించారు.