తెలంగాణ

telangana

కర్​నాటకం: కాంగ్రెస్-జేడీఎస్​ నేతల భేటీ

కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోకుండా కాంగ్రెస్​-జేడీఎస్​ అధికార కూటమి చర్యలు మొదలుపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్​లో రెండు పార్టీల కీలక నేతలు సమావేశం అయ్యారు.

By

Published : Jul 7, 2019, 10:59 PM IST

Published : Jul 7, 2019, 10:59 PM IST

కర్ణాటక

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్​ నేతలు బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్​లో సమావేశమయ్యారు. ఈ భేటీలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి, జేడీఎస్​ సీనియర్​ నేత హెచ్​డీ దేవెగౌడ, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర, కాంగ్రెస్ సీనియర్​ నేతలు హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేల రాజీనామా విషయం తెలియగానే అమెరికా పర్యటనలో ఉన్న కుమారస్వామి హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. వచ్చీ రాగానే నేరుగా హోటల్​లో జరిగే సమావేశానికి హాజరయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి.

వెనక్కి తగ్గం: ఎమ్మెల్యేలు

రాజీనామా నిర్ణయంపై వెనక్కు తగ్గేదీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ తెలిపారు. ముంబయి లోని ఓ హోటల్​లో బస చేస్తున్న 13 మంది ఎమ్మెల్యేలందరూ ఇదే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

"నాతో కలిపి 13 మంది ఎమ్మెల్యేలందరమూ కలిసి స్పీకర్​కు రాజీనామా సమర్పించి గవర్నర్​కు సమాచారం ఇచ్చాం. అందరమూ కలిసే ఉన్నాం. తిరిగి బెంగళూరుకు వెళ్లే ప్రసక్తే లేదు. రాజీనామాలను వెనక్కు తీసుకోం."

-ఎస్టీ సోమశేఖర్​, కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇదీ చూడండి: 'సంక్షోభానికి కాంగ్రెస్​- జేడీఎస్ అంతర్గత కలహాలే కారణం'

ABOUT THE AUTHOR

...view details