తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముమ్మారు తలాక్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం - ముమ్మారు

ముమ్మారు తలాక్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లును ఉదయం ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. సభలోని 303 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా.. 82 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతకుముందు ముమ్మారు తలాక్​ బిల్లును స్టాండింగ్​ కమిటీకి పంపాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది.

ముమ్మారు తలాక్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

By

Published : Jul 25, 2019, 7:57 PM IST

Updated : Jul 25, 2019, 8:20 PM IST

ముమ్మారు తలాక్‌ ద్వారా భార్యకు విడాకులు ఇస్తే నేరంగా పరిగణించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లును ఉదయం ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. సభలోని 303 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా.. 82 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్‌సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదం కోసం పంపించనున్నారు.

ముమ్మారు తలాక్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

వెంటనే మూడుసార్లు తలాక్‌ చెప్పి, భార్యకు విడాకులు ఇచ్చే భర్తకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడాన్ని విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ఆ నిబంధనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వాదించాయి. ఈ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా ఎన్డీయే మిత్రపక్షం జేడీయూతో పాటు కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

అంతకుముందు ముమ్మారు తలాక్‌ బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. బిల్లును స్టాండింగ్​ కమిటీకి ( స్థాయి సంఘం)​ పంపాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. కాంగ్రెస్​ సభ్యుడు మహ్మద్​ జావేద్ బిల్లుపై మాట్లాడుతూ.. ముస్లిం వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకు స్థాయి సంఘానికి పంపాలని కోరుతున్నాం. అన్ని వర్గాల మహిళలకు సంబంధించి చట్టాల్ని రూపొందించాలి... కేవలం ముస్లిం మహిళల కోసమే కాదు. ముస్లిం పురుషులను జైలుకు పంపాలనే దురుద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆర్టికల్​ 14ను అతిక్రమిస్తుంది." - మహ్మద్​ జావేద్, కాంగ్రెస్​ సభ్యుడు​

ధ్వజమెత్తిన అసదుద్దీన్‌...

తలాక్‌ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు అసదుద్దీన్​ ఒవైసీ. ముస్లింలపై జరుగుతున్న దాడులు వంటి అనేక అంశాలను పెండింగ్‌లో పెట్టి ముమ్మారు తలాక్‌పైనే ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించారు. తలాక్‌ బిల్లు వల్ల మహిళలే ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లింలపై దాడులకు పాల్పడిన వారికి శిక్షలు ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. వివాహాల విషయంలో షరియత్‌ చట్టాల్లోనూ ఎన్నో నిబంధనలు ఉన్నాయని అసద్‌ తెలిపారు.

Last Updated : Jul 25, 2019, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details