రాజస్థాన్లో గత వారం జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 961 వార్డుల్లో విజయం సాధించింది. భాజపా 737 స్థానాలతో సరిపెట్టుకుంది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో... కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి భాజపాపై 49 పురపాలికల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.
ఆశించిన విధంగానే...
2018 డిసెంబర్లో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు సగం వార్డుల్లో గెలుచుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడకముందే... ఫలితాలు ఆశించిన విధంగానే వచ్చాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ పేర్కొనడం విశేషం.
'ప్రభుత్వ పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రజలు.. పార్టీకి పట్టంకట్టడం చాలా సంతోషకరమైన విషయం." - అశోక్ గెహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి