కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలు స్వీకరించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో గహ్లోత్ ఈ అంశాన్ని లేవనెత్తారు.
గహ్లోత్ ప్రతిపాదనకు యువ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ మద్దతు పలికారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఐసీసీ భేటీ నిర్వహించి రాహుల్‌ను అధ్యక్షుడిగా చేయాలని శ్రీనివాస్ అన్నారు.
చర్చ జరగలేదు..
అయితే సీడబ్ల్యూసీలో గహ్లోత్ ప్రతిపాదన చర్చకు రాలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.