భాజపా ప్రభుత్వం తెచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిందని, కోట్లాది ఉద్యోగాలు నాశనమయ్యాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పన్ను స్లాబు ఉండే సరళతర జీఎస్టీని తీసుకొస్తామని స్పష్టం చేశారు.
'జీఎస్టీ 2.ఓ'పై వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం అమలవుతున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వల్ల చిన్న వ్యాపారులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వీడియోలో పొందుపరిచారు. అలాగే కాంగ్రెస్ జీఎస్టీని ఎలా సరళతరం చేస్తుందో వివరించారు.
జీఎస్టీని గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌గా అభివర్ణించారు రాహుల్.