తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విశ్లేషణ కమిటీతో భేటీ కాని దిల్లీ అభ్యర్థులు

లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషించేందుకు దిల్లీ కాంగ్రెస్​ విభాగం ఏర్పాటు చేసిన కమిటీ ముందు లోక్​సభ అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

కాంగ్రెస్ కమిటీ ముందు దిల్లీ అభ్యర్థుల గైర్హాజరు

By

Published : Jun 2, 2019, 7:38 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణాలపై కాంగ్రెస్ దిల్లీ విభాగం ఏర్పాటు చేసిన విశ్లేషణ కమిటీ ముందుకు రాలేదు అక్కడి ఏడు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు. రెండు జిల్లాల అధ్యక్షులు, మరికొంతమంది నేతలు మినహా మిగతా నాయకులెవరూ హాజరు కాలేదని సమాచారం.

ఓటమి కారణాలను విశ్లేషించేందుకు కాంగ్రెస్ దిల్లీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ గత సోమవారం యోగేంద్ర శాస్త్రి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. 10 రోజుల గడువులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఈశాన్య దిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు షీలా దీక్షిత్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్. మిగతా సభ్యులెవరూ కమిటీ ముందు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తమను హాజరుకావాలని కోరేందుకు కమిటీకి ఉన్న అధికారమేమిటని పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారు. కాంగ్రెస్ దిల్లీ వ్యవహారాల బాధ్యుడు పీసీ చాకో అనుమతి లేకుండా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

లోక్​సభ ఎన్నికలకు ముందు ఆప్​తో పొత్తుపై చర్చల్లో చివరి నిమిషం వరకూ అస్పష్టత నెలకొన్న కారణంగా కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికలో సందిగ్ధత ఏర్పడింది. ఈ కారణంగా దిల్లీ ఎన్నికల ప్రచారంలో వెనకబడి, ఘోర పరాజయాన్ని చవిచూసింది.

సోనియాకు గహ్లోత్ శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన యూపీఏ ఛైర్​పర్సన్ సోనియాగాంధీకి శుభాకాంక్షలు తెలిపారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్.

" మీ సారథ్యంలో ప్రజల ఆసక్తులను కాపాడేందుకు పార్లమెంట్​లో కాంగ్రెస్ సమర్థంగా పోరాడుతుంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేస్తుంది."

-అశోక్​ గహ్లోత్

శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో సోనియాను పార్లమెంటరీ పార్టీనేతగా ఎన్నుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details