తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశానికి ఇప్పుడు కాంగ్రెస్​ అవసరం ఉంది' - గెహ్లోట్

కాంగ్రెస్​ ఎన్నటికీ అంతం కాదని రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​ ఉద్ఘాటించారు. లోక్​సభ ఎన్నికల్లో పరాజయానికి కారణాలు విశ్లేషిస్తామని పేర్కొన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

'దేశానికి ఇప్పుడు కాంగ్రెస్​ అవసరం ఉంది'

By

Published : May 25, 2019, 8:13 AM IST

'దేశానికి ఇప్పుడు కాంగ్రెస్​ అవసరం ఉంది'

దేశంలో కాంగ్రెస్​కు పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​. భారత్​కు కాంగ్రెస్​ చేయాల్సిన సేవ ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ప్రజల ఉద్వేగాలను వాడుకుని భాజపా గెలిచిందని ఆరోపించారు.

"స్వతంత్ర భారతంలో 70 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కాపాడుతూ వచ్చింది. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యలపై చర్చ జరగకపోవటం నన్ను బాధించింది. కులం, మతం, జాతీయవాదం, సైన్యం సాధించిన విజయాలను పేర్కొంటూ అబద్ధాలతో భాజపా అధికారాన్ని పొందింది. సమస్యల పరిష్కారం దిశగా రాహుల్ గాంధీ ప్రచారం సాగించారు. కాంగ్రెస్ ఎన్నటికీ అంతం కాదు. ఇప్పుడు దేశానికి కాంగ్రెస్ కావాలి. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా పార్లమెంట్​లో మేం పోరాడతాం. ప్రతిపక్ష పాత్రలో ప్రజల సమస్యలను లేవనెత్తుతాం."

-అశోక్​ గెహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: నేడు పార్లమెంట్​లో ఎన్డీఏ సభ్యుల భేటీ

ABOUT THE AUTHOR

...view details