పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. ఈ మేరకు.. పార్టీలో అంతర్గత సంస్కరణల ప్రక్రియను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ(సీఈఏ)ప్రారంభించింది.
కాంగ్రెస్లో అంతర్గత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు.. ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి, 2021 నాటికి ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని సీఈఏ సభ్యుడు ఒకరు తెలిపారు.
నవంబర్ కల్లా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను పూర్తి చేయాలని సీఈఏ నిర్ణయించింది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి లభించగానే.. ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్. త్వరలోనే ఈ ఎన్నికల ప్రక్రియపై.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుూసీ) సమావేశం జరగనుంది.
కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుసూదన్ మిస్త్రీ.. ఛైర్మన్గా వ్యవహరిస్తున్న సీఈఏ బుధవారం సమావేశమైంది. సీఈఏ సభ్యులు.. కృష్ణ బైరేగౌడ, ఎస్.జ్యోతిమణి , అర్విందర్ సింగ్ లవ్లీలు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:బిహార్ బరి: 'కోసీ'పై 'బాహుబలి' పట్టు నిలిచేనా?