తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పేదరికమే వారికి రాజకీయ ఆయుధం'

ఒడిశాలోని సోనేపుర్​ ప్రచార సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రతిసారీ ప్రధాన రాజకీయ ఆయుధంగా పేదరికాన్నే వినియోగించుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్​కు దూరంగా ఉండటమే పేదరిక నిర్మూలనకు ఉత్తమ పరిష్కారమని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​కు ప్రతిసారీ పేదరికమే ఆయుధం:మోదీ

By

Published : Apr 6, 2019, 6:45 PM IST

కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన రాజకీయ ఆయుధంగా పేదరికాన్నే ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పేదరిక నిర్మూలనకు ఉత్తమ పరిష్కారం కాంగ్రెస్​ పార్టీకి దూరంగా ఉండటమేనని పిలుపునిచ్చారు మోదీ. కాంగ్రెస్​ ఉన్నంత కాలం పేదరిక నిర్మూలన సాధ్యం కాదని... కాంగ్రెస్​ను పక్కనపెడితే పేదరికం దానికదే కనిపించకుండా పోతుందని అన్నారు.

ఒడిశా బలంగిర్​ లోక్​సభ నియోజకవర్గంలోని సోనేపుర్​ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ.

పేదరికమే వారికి రాజకీయ ఆయుధం: మోదీ

"ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేస్తారా చేయరా? పేదలకు సంబంధించిన అభివృద్ధి పథకాలను రాజకీయం చేస్తున్నారు. దళారులకు మేలు చేకూరుస్తూ ఉంటే పేదరికం అంతమవదు. కాంగ్రెస్ చేసిన తప్పే బీజేడీ ప్రభుత్వం చేస్తోంది. ఈ కారణంగానే వారి అనుకూలుల ఆటకట్టించాం. " -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కాంగ్రెస్​ హఠావో అని పిలుపునిచ్చారు మోదీ. పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్​ కేవలం నినాదాలు ఇచ్చిందే కాని భరోసా కల్పించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details