తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2019, 7:57 AM IST

ETV Bharat / bharat

ఐటీని కేంద్రం ఉసిగొల్పుతోంది : కాంగ్రెస్​

ఐటీ దాడుల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు.

కాంగ్రెస్

ఐటీ దాడులపై కాంగ్రెస్ విమర్శలు

తమిళనాట వరుసగా జరుగుతున్న ఐటీ దాడులపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. డీఎంకే నాయకురాలు కనిమొళి నివాసంలో జరిగిన ఐటీ సోదాలను ఉదహరిస్తూ ప్రభుత్వ తీరుపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

"విపక్షాల వద్దనే నల్లధనం ఉందని అధికారులకు సమాచారం వస్తోందా? ఇది ఎలా సాధ్యం? తమిళనాడులో పార్లమెంట్​ ఎన్నికల వేళ ఐటీ శాఖ నిరంకుశ, పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది."
-పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

ప్రజలే బుద్ధి చెబుతారు: సుర్జేవాలా

ఎన్నికల్లో విజయం కోసం విపక్షాలపై ఐటీ దాడులను మోదీ అస్త్రంగా వాడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఆరోపించారు.

"విపక్షాలపై ఐటీ, ఈడీలతో మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయిస్తోంది. భాజపాకు నాలుగు మిత్ర పక్షాలు ఉన్నాయి. మోదీ, అమిత్​షా, ఈడీ, ఐటీ. వీటితోనే ఎన్నికల్లో పోరాడుతున్నారు. పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు. మే 23న భాజపాకు గట్టిగా బుద్ధి చెబుతారు."
-రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

తూత్తుకుడిలోని కనిమొళి నివాసంలో ఐటీ శాఖమంగళవారం సోదాలు నిర్వహించింది. అదే రోజు రాత్రి థేని లోక్​సభ నియోజకవర్గంలో తనిఖీలు చేసింది. అడ్డుకున్న టీటీవీ దినకరన్​ పార్టీ ఏఎంఎంకే కార్యకర్తలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు . థేనిలో జరిగిన దాడుల్లో రూ. 1.48 కోట్లను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.

ఇదీ చూడండి: దినకరన్​ వర్గంపై ఐటీ దాడులు- గాల్లోకి కాల్పులు

ABOUT THE AUTHOR

...view details