తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సార్వత్రికానికి 8వ జాబితా ప్రకటించిన కాంగ్రెస్​

సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను వేగంగా ప్రకటిస్తోన్న కాంగ్రెస్​ పార్టీ తాజాగా ఎనిమిదో జాబితా ప్రకటించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, మణిపుర్​, ఉత్తరాఖండ్​, యూపీ నుంచి మొత్తం 38 మందిని ఖరారు చేసింది.

By

Published : Mar 24, 2019, 6:36 AM IST

Updated : Mar 24, 2019, 6:53 AM IST

గుల్భార్గ నుంచి పోటీ చేయనున్న ఖర్గే, భోపాల్​ నుంచి బరిలో దిగ్విజయ్​

గుల్భర్గ నుంచి ఖర్గే పోటీ- భోపాల్​ బరిలో దిగ్విజయ్​
ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​ లోక్​సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. కర్ణాటక, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, మణిపుర్​, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ నుంచి సార్వత్రికంలో తలపడే 38 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది అధిష్టానం.

ఇదీ చూడండి:ఆర్థిక నేరగాళ్లకే మోదీ కాపలాదారు : సిబల్​

కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే కర్ణాటకలోని గుల్బర్గ స్థానం నుంచి పోటీచేయనున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్​ చవాన్​ నాందేడ్​ నుంచి బరిలోకి దిగుతున్నారు. మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్​ మధ్యప్రదేశ్​లోని భోపాల్​ నుంచి, ఉత్తరాఖండ్​ మాజీ సీఎం హరీశ్​​ రావత్​ నైనీతాల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది హస్తం పార్టీ.

ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన మనీష్​​ ఖండూడీని గఢ్వాల్​​ స్థానం నుంచి పోటీ చేయించనుంది. వీరు భాజపాకు చెందిన ఉత్తరాఖండ్​ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూడీ కుమారుడు.

కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, కేఎం. మునియప్ప చిక్​బల్​పుర్​, కోలార్​ స్థానాల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితులైన మీనాక్షి నటరాజన్​ మధ్యప్రదేశ్​లోని మంద్సౌర్​ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ ప్రతినిధి రషీద్​ అల్వీని యూపీలోని అమ్రోహా లోక్​సభ స్థానంలో కాంగ్రెస్​ అభ్యర్థిగా ప్రకటించింది.

ఏప్రిల్​ 11 నుంచి జరగనున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఇప్పటివరకు 218 అభ్యర్థుల్ని ప్రకటించింది. మే 19 వరకు జరగనున్న పోలింగ్​ ఏడు దశల్లో నిర్వహించనున్నారు. మే 23న ఫలితాలు వెలువరించనున్నారు.

Last Updated : Mar 24, 2019, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details