సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. మోదీ సర్కార్ మరిన్ని సమర్థవంతమైన, కీలక నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది.
చైనా యాప్ల నిషేధం వల్ల చైనా సాంకేతిక కంపెనీలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్.
"చైనా యాప్స్ నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తన్నాం. చైనా... భారత భూభాగంలోకి చొరబడి, సాయుధ దళాలపై అప్రజాస్వామిక దాడి చేసిన దృష్ట్యా, మోదీ సర్కార్ మరిన్ని సమర్థవంతమైన చర్యలను తీసుకుంటుందని ఆశిస్తున్నాము."
-అహ్మద్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు