అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల రసీదులు లెక్కించి, ఈవీఎం ఫలితంతో సరిపోల్చాలన్న తీర్పును పునః సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరింది కాంగ్రెస్ పార్టీ. ఉపయోగం లేనప్పుడు రూ. 18 వేల కోట్లు వెచ్చించి వీవీ ప్యాట్లు కొనడం దేనికని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.
"కేవలం ఐదు వీవీ ప్యాట్ల లెక్కింపుతో మేము సంతృప్తి చెందము. ఒక పౌరుడిగా నేను వీవీ ప్యాట్లకోసం రూ. 18వేల కోట్లు చెల్లింపు చోయబోతున్నానని భావిస్తున్నాను. ప్రతి రాజ్యాంగ వ్యవస్థపైనా ప్రజలదే అంతిమ అధికారం. ప్రతి ప్రభుత్వం ఎన్నికలు ఉచితమైనవి, న్యాయబద్ధమైనవి, ఏ విధమైన అనుమానాలకు తావు లేనివని నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది"- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి.