తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

కాంగ్రెస్ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కవాతులు చేపట్టాలని నిర్ణయించింది పార్టీ అధిష్ఠానం. 'సేవ్​ కాన్​స్టిట్యూషన్​-సేవ్​ ఇండియా' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనల నడుమ కాంగ్రెస్​ నిర్ణయం చర్చనీయాంశమైంది.

Cong to take out marches across country on its foundation day
కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

By

Published : Dec 28, 2019, 6:06 AM IST

కాంగ్రెస్ 134వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు శనివారం... దేశవ్యాప్తంగా జరుపుకోనున్నాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ... దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరిస్తారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలోని గువాహటిలో నిర్వహించే ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లఖ్​నవూలో ఉత్తర్​ప్రదేశ్ కాంగ్రెస్​ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడుతారు.

'జెండా ఎగరేయండి..'

ఆయా రాష్టాల రాజధానుల్లో ప్రదేశ్​ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించాలని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 'రాజ్యాంగాన్ని రక్షించండి- భారత్​ను రక్షించండి' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే సమావేశాల్లో తమ తమ భాషల్లో రాజ్యాంగం ఉపోద్ఘాతాన్ని చదివి వివరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details