మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని ఇటీవలే ప్రకటించారు రాహుల్ గాంధీ. ఉద్యోగాల కల్పన, విద్య, వైద్య వ్యవస్థల బలోపేతం, ఆర్థికవృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పారు. కనీస ఆదాయ పథకం ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశంగా ఉండనుంది.
నేడు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక విడుదల - దిల్లీ
కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ముఖ్యనేతలు మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించనున్నారు.

కాంగ్రెస్
కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టో విడుదల నేడే
దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది రాజకీయ నేతలు, వివిధ వర్గాల ప్రజలను సంప్రదించి, అందరి సలహాలు సూచనల మేరకు మేనిఫెస్టోను తయారు చేసింది పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీ. పార్టీ మేనిఫెస్టో కమిటీకి మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అధ్యక్షత వహించారు.
Last Updated : Apr 2, 2019, 6:49 AM IST