తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీవీసీగా సంజయ్​ కొఠారి- తప్పుపట్టిన కాంగ్రెస్​ - cvc latest update

కేంద్ర విజిలెన్స్​ ప్రధాన కమిషనర్​గా రాష్ట్రపతికి కార్యదర్శిగా ఉన్న సంజయ్​ కొఠారిని ఎంపిక చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ. అయితే.. ఈ ఎంపిక విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టింది కాంగ్రెస్​. అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆరోపించింది. ఈ నియామకాన్ని రద్దు చేసి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించాలని డిమాండ్​ చేసింది.

CVC
సీవీసీగా సంజయ్​ కొఠారి

By

Published : Feb 19, 2020, 7:48 PM IST

Updated : Mar 1, 2020, 9:12 PM IST

కేంద్ర విజిలెన్స్ ప్రధాన​ కమిషనర్​​​(సీవీసీ)ర్​గా సంజయ్ కొఠారి ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్రపతికి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సీవీసీగా ఎంపిక చేసింది.

కాంగ్రెస్​ విమర్శలు..

సీవీసీగా కొఠారి ఎంపికను తీవ్రంగా తప్పుపట్టింది కాంగ్రెస్​. ఈ విధానం అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. వెంటనే నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేసింది.

కొత్త సీవీసి నియామకానికి మరోమారు ప్రక్రియ ప్రారంభించి దరఖాస్తులు ఆహ్వానించాలని కోరారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి మనీశ్​ తివారీ. సీవీసీ ఒక రబ్బరు స్టాంప్​లా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని విమర్శించారు.

మనీశ్​ తివారీ, కాంగ్రెస్​ ప్రతినిధి

" మొత్తం ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఎలాంటి వివాదం లేని ఎంపిక కమిటీని ఏర్పాటు చేసి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించేందుకు ప్రక్రియను ప్రారంభించాలి. సరైన పద్ధతిలో ఈ ప్రక్రియ ఉండాలి. ఆ తర్వాత ఉన్నత స్థాయి కమిటీకి సిఫార్సు చేయాలి. "

- మనీశ్​ తివారీ, కాంగ్రెస్​ ప్రతినిధి

సీవీసీ, సీఐసీల నియామకం అంశంలో ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేశారు కాంగ్రెస్​ ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'నవ భారత్'​లో పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ విలువలకు చోటులేదని దుయ్యబట్టారు. నియంత్రణ లేని విధంగా నియామకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఉన్నత న్యాయ సంస్థల అంశంలో ఏకపక్షంగా వ్యవహరించటం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుందని హెచ్చరించారు సుర్జేవాలా.

సుర్జేవాలా ట్వీట్​

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్​: ఆశలపై నీళ్లు- ట్రేడ్​ డీల్​ లేనట్టే!

Last Updated : Mar 1, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details