తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 'డొల్ల' ప్రసంగంలో ఉద్దీపన మాటేది?: కాంగ్రెస్ - మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. లాక్​డౌన్​ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ... ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాని ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలు గురించి ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు.

Cong says PM's address hollow, no mention of financial package
మోదీ 'డొల్ల' ప్రసంగంలో ఆర్థిక ఉద్దీపన ప్రకటనేదీ?: కాంగ్రెస్

By

Published : Apr 14, 2020, 1:09 PM IST

జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రసంగంలో మోదీ వాక్చాతుర్యమే తప్ప విషయం ఏమీ లేదని దుయ్యబట్టింది. ఆర్థిక ప్యాకేజీ గురించి గానీ, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి ఆయన ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సరైన కార్యాచరణ ప్రణాళిక ఏది?

"కరోనాపై పోరాడడానికి ప్రభుత్వం వద్ద సరైన కార్యాచరణ ప్రణాళిక ఉందా?" అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రుణదీప్ సుర్జేవాలా. "నాయకత్వం అంటే.... ప్రజలకు వారి బాధ్యతల గురించి చెప్పడం కాదు. దేశ ప్రజల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడం" అని అన్నారు సుర్జేవాలా.

దేశమా... రోదించు!

లాక్​డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్​ నేత పి.చిదంబరం స్పష్టం చేశారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సాయం చేయాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన విజ్ఞప్తిపై ప్రధాని ఏ మాత్రం స్పందించలేదని విమర్శించారు.

దేశం రోదిస్తోంది..!

"పేదలు 21+19 రోజుల పాటు తమను తాము రక్షించుకోవాలి తప్ప.. ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించదు. ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు, ఆహారం ఉంది. కానీ వాటిని విడుదల చేయదు. నా ప్రియ దేశమా... రోదించు.​

2020 మార్చి 25 నాటి ఆర్థిక ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా జోడించలేదు. రఘురామ్ రాజన్​ నుంచి జీన్ డ్రెజ్ వరకు, ప్రభాత్​ పట్నాయక్​ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు ఎందరో ఆర్థికవేత్తలు ఇచ్చిన సలహాలు చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందాన వ్యర్థమైపోయాయి."

- పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత ట్వీట్

మోదీ 'హామ్లెట్'​

మోదీ ప్రసంగం డెన్మార్క్ యువరాజు లేని 'హామ్లెట్​' నాటకంలా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ( 'హామ్లెట్'​ అనేది విఖ్యాత రచయిత షేక్స్​స్పియర్ రాసిన ప్రసిద్ధ నాటకం).

"ప్రధాని మోదీ అద్భుత ప్రసంగం చేశారు. ఇందులో వాక్చాతుర్యం తప్ప ఇంకేమీ లేదు. లాక్​డౌన్ మంచిదే. కానీ ప్రజల జీవనోపాధి సమస్య ఉండనే ఉంది. కానీ మోదీ ఎలాంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించలేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు; వ్యాపారాలకు, పరిశ్రమలకు ఉద్దీపన కలించే ఎలాంటి కచ్చితమైన చర్యలు లేవు."

- అభిషేక్​ సింఘ్వీ, కాంగ్రెస్ ప్రతినిధి

సమర్థిస్తున్నా... కానీ..

లాక్​డౌన్ పొడిగిస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మరో కాంగ్రెస్ నేత శశి థరూర్​ పేర్కొన్నారు. అయితే ప్రజలకు ఆర్థిక ఉద్దీపన కలిగించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఉపాధి హామీ పథకం చెల్లింపులు, జన్​ధన్ ఖాతాలు, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన సూచించారు.

సమర్థిస్తున్నా... కానీ..

"లాక్​డౌన్ పొడిగిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. లాక్​డౌన్​ వల్ల కలిగిన లాభాన్ని నేను విస్మరించలేను."

- శశి థరూర్​, కాంగ్రెస్ నేత

మే 3 వరకు లాక్​డౌన్​

దేశంలో మే 3 వరకు లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనాను అంతమొందించేందుకు చేపట్టిన ఈ చర్య... ఇప్పటికే మంచి ఫలితాలను ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్ 2.0పై రేపు మార్గదర్శకాలు- 3 జోన్లుగా భారత్​!

ABOUT THE AUTHOR

...view details